12-07-2025 08:40:15 PM
వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం..
హుజూర్ నగర్: చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జీ గడ్డం కాశీం పేర్కొన్నారు. శనివారం పట్టణంలో టౌన్ హాల్ లో ఇంద్రాల పిచ్చయ్య, పొనుగుపాటి లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంచాలన్నారు. ఆసరా పెన్షన్ దారులైన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులకు 2016 రూపాయల నుండి 4016 రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈనెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సుకు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ హాజరు కానున్నారు. మండల చేయిత పింఛన్ దారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింత సతీష్, గిద్దె రాజేష్, శ్రీనివాసరావు, బంటు పుల్లయ్య గౌడ్, వల్లెపు రూపరాణి, ఇసాక్, చేజర్ల వెంకటేశ్వర్లు, చింత్రాల వెంకటేశ్వర్లు, బసవోజు నాగచారి, తారాబాయి, కంకణాల వీరలక్ష్మి, ఉండేటి ప్రశాంతి, బంగారు రామకృష్ణ, హుస్సేన్, నరసింహ రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.