calender_icon.png 7 November, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం

07-11-2025 01:32:10 AM

-ఆ స్థాయిని నిలిపే బాధ్యత మీదే: డీజీపీ శివధర్‌రెడ్డి

-ప్రొబెషనరీ డీఎస్పీల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ  

రంగారెడ్డి, నవంబర్ 6(విజయక్రాంతి): దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీల పైన కూడా ఉందని డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నా రు. ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో గురువారం నిర్వహించిన ప్రొ బేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్ల శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ ,టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండి ల్యా, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మ హేష్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వీసీ సజ్జనార్ (హైదరాబాద్),సుధీర్ బాబు(రాచ కొండ), అవినాష్ మహంతి(సైబరాబాద్) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో కూడుకున్న అతి పెద్ద బ్యాచ్ ఇదేనని తెలిపారు. పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా దాని ఆత్మను అర్థం చేసుకోవాలని, నిష్పాక్షికత, ఓ ర్పు, సహానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని తెలిపా రు. గ్రేహౌండ్స్, ఆక్తోపస్, సీఐ సెల్, టిజీసీఎస్బీ, ఈగిల్ వంటి ప్రత్యేక సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్ ఆధునిక పోలీసింగ్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కమాండ్ కంట్రో ల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శ నాలని తెలిపారు.

ఈ బ్యాచ్‌లో38 మంది మహిళా అధికారులు ఉండటం గర్వకారణమని,  తెలంగాణ పోలీస్ భవిష్యత్తు మీరే అ ని అన్నారు. గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. భద్రత, గౌరవం, న్యాయం, వృత్తి నైపుణ్యత కు ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ మాట్లాడుతూ పది నెలలపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి సంసిద్ధులై ఉండాలనిన్నారు.ఈ సందర్భంగా సిలబస్ కాపీలను డీజీపీ ఆవిష్కరించారు. ఐజీపీలు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎం .రమేష్, రమేష్ నాయు డు,అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు , మురళీధర్ , జి కవిత తదితరులు శిక్ష ణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.