calender_icon.png 23 December, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

23-12-2025 02:33:55 AM

అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలి

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, డిసెంబర్ 22 (డిసెంబర్): జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి అధికారు లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత అందు బాటులో ఉంచేందుకు ప్రభుత్వం రూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తుందన్నారు.

వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత చేరువలో వేగవం తమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా వైద్యులు, సిబ్బంది సంఖ్య పెంపొందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణ పను లను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకో వాలన్నారు. అంతకుముందు పాత మంచి ర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీ లించారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి దిశ గా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత అందించి మహిళలు ఆర్థిక స్వావ లంబన పొందే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మహిళా భవన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.