24-10-2025 12:49:29 AM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ భూమి పూజ
ఉట్నూర్,అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలం సాలైగూడ, రాం గూడ, ధర్మాజీపేట, కొలాం గూడాలలో పర్యటించారు. ఆయా గ్రామా ల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే అందించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 25 వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.
పనులు నిర్మాణాలు నాణ్యతగా, సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.