24-10-2025 12:50:51 AM
నవీన్ గోల్ బ్రదర్స్ వారి ఆర్థిక సాయం
నిర్మల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ప్రతి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలబడి ధైర్యం ఇస్తుందని జిల్లా ఎస్పీ జానకి భరోసా ఇచ్చారు. గురువారం పోలీసు సంస్మరణ వారోత్సవాల భాగంగా నిర్మల్ పట్టణం చెందిన నవీన్ గోల్ బ్రదర్స్ అందించి ఆర్థిక సాయం హోంగార్డు పేద కుటుంబంలో చదువుకున్న పిల్లలకు అందించారు.
మొత్తం 20 మందికి 10,000 చొప్పు న చెక్కులను అందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు కుటుంబాలకు చేయూతనందించేందుకు ముందుకు వచ్చిన నవీన్ గోల్ బ్రదర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ అవినాష్ కుమార్ రాజేష్ మీనా నవీన్ గోల్ బ్రదర్ సభ్యులు పోలీసులు పాల్గొన్నారు