17-11-2025 12:00:00 AM
మోర్తాడ్, నవంబర్16 (విజయ క్రాంతి): పాలెం గ్రామానికి చెందిన బీజేపీ మోర్తాడ్ మండల ఉపాధ్యక్షులు కుంట శ్రీనివాస్ రెడ్డి నాయనమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు, శని వారం రోజు పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి కుంట శ్రీనివాస్ రెడ్డిని, కుంట గంగ రెడ్డి పిప్పెర రామ్ రెడ్డి లను వారి నివాసం లో పరామర్శించారు. వారి వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ కుమార్ బీజేపీ ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ కిసాన్ మోర్చా మోర్తాడ్ మండల ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి ఉన్నారు.