calender_icon.png 6 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక్ స్కూల్స్‌లో స్థానిక కోటా కొనసాగించండి

06-05-2025 01:23:34 AM

ఎంపీ రఘునందన్ వినతి

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ విద్యార్థులకు ఏపీలోని సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి సంజయ్ సేథ్‌ను విజ్ఞప్తి చేసినట్టు మెదక్ ఎంపీ రఘునందన్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనూ తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటా కొనసాగించాలని పేర్కొన్నట్టు వెల్లడించారు. సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ విద్యార్థులు సుమారు 30 వేల మంది వరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూల్స్‌లో 67 శాతం స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్లు రక్షణ శాఖ ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో మన రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై కేంద్ర మంత్రితో ఫోన్‌లో మాట్లాడి అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు గుర్తుచేశారు.

మంగళవారం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయనతో భేటీ అవనున్నట్టు తెలిపారు. కొత్తగా తెలంగాణకు మూడు సైనిక్స్ స్కూల్స్ మంజూరు చేయాలని, అప్పటివరకు తెలంగాణ విద్యార్థులకు 67 శాతం స్థానిక కోటాను కొనసాగించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ మేరకు మంత్రి సంజయ్ సేథ్ నుంచి సానుకూలం స్పందన వచ్చిందన్నారు.