22-12-2025 12:10:16 AM
రామన్నపేట సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకట్ రెడ్డి
బోయినపల్లి : డిసెంబర్ 21( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రా మన్నపేట గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నూతన సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి చెప్పారు. నేడు ( సో మవారం) బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామ సర్పంచ్ గా గ్రామపంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రామన్నపేట గ్రామ ప్రజలకు తను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించినందుకు తన విజయానికి బాసట గెలిపించినందుకు తన విజయానికి బాసట నిలిచినగా నిలిచిన గ్రామ ప్రజల కష్టాన్ని ఇప్పటికి మరిచిపోనని చెప్పారు. రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రజాప్రతినిదుల ప్రజల సహకారంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. రామన్నపేట నుంచి బోయినపల్లి రహదారి నిర్మాణం కు, గ్రామంలో ఇంటర్నల్ రహదారుల నిర్మాణానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా గ్రామంలో వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఇప్పించేందుకు ప్రణాళిక రూపొందించి ఇప్పించేందుకు ప్రణాళిక తయారు చేసిన చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు చెప్పారు. నేడు సర్పంచి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి తెలిపారు.