calender_icon.png 22 December, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తులపై సన్నద్ధత కోసమే మాక్ ఎక్సర్‌సైజ్

22-12-2025 12:11:39 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): వరదలు, ఇతర విపత్తులు సంభ వించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త ల విషయంలో సన్నద్ధతను తెలుసుకు నేందుకు వీలుగా ఈ నెల 22న చేపడుతున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. వరదలు, పారిశ్రామిక ప్రమా దాలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో ఈ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తోందని తెలిపారు. విపత్తుల నిర్వహణతో అను సంధానం  కలిగి ఉన్న అన్ని శాఖలు సమన్వ యంతో ఒకేసారి అన్ని చోట్ల మాక్ ఎక్స్సజ్ నిర్వహించి, వ్యవస్థల సామర్థ్యం, సన్నద్ధత, సమన్వయాన్ని అంచనా వేయడం జరుగు తుందని అన్నారు.

ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని, విపత్తులు తలెత్తిన సమయాలలో వాటిని సమర్ధవం తంగా ఎదుర్కొనేలా సమాయత్తం అయ్యేం దుకు మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం దోహద పడుతుందని అన్నారు. ఇందులో భాగంగా నే నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం 9.00 గంటలకు ఏకకాలంలో మూడు వేర్వేరు చోట్ల వరద సహాయక చర్యలపై మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. బోధన్ డివిజన్ లోని హంగర్గ గ్రామంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), ఖిల్లా రఘునాథ్ చెరువు వద్ద మూడు ప్రదేశాలలో మాక్ ఎక్సర్ సైజ్ కొనసాగుతుందని వివరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎక్సర్ సైజ్ విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.