calender_icon.png 31 October, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా లక్ష్య సాధనకు సహకరించాలి

29-10-2025 07:20:43 PM

ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్య సాధనకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధనకు సహకరించారో, అదేవిధంగా ఇక ముందు సైతం సహకరించాలని యూనియన్ నాయకులను ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. ఏరియా జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన కార్మికుల పలు సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘమైనా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)తో 11వ ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏరియా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధిలో, ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, ఉత్పాదకతలోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సైతం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా గడిచిన స్టృక్చరల్ సమావేశాలలో జరిగిన పనుల పురోగతిని చర్చించారు. గుర్తింపు సంఘ నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిఎం స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సభ్యులు యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, స్ట్రక్చరల్ కమిటీ సభ్యుడు సివి రమణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, కేకే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఐఈడి ఎస్ఈ కిరణ్ కుమార్, ఏరియా స్టోర్స్ డిజిఎం ఈ అండ్ ఎం ఎం సురేష్, సివిల్ ఎస్ఈ రాము, ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ ఎం మధు కుమార్, డివైపిఎం సందీప్, ఏరియా ఉన్నతాధికారులు,యూనియన్ నాయకులు పాల్గొన్నారు.