03-05-2025 09:35:26 PM
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపల్ అభివృద్ధికి పట్టణ వ్యాపార వర్గం, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ , ట్రాఫిక్ ఫుట్ పాత్, ఇంకుడు గుంటలు పై ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపినారు .మణుగూరు మున్సిపల్ అభివృద్ధికి అందరూ సంపూర్ణ సహకారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో మణుగూరు మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ ,సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వంగ రవీందర్ రెడ్డి , మణుగూరు పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ నాయకులు దోసపాటి నాగేశ్వరరావు, దండ రాధాకృష్ణ వలసాల వెంకట రామారావు, బేతంచెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు