19-11-2025 12:51:29 AM
పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
నారాయణఖేడ్, నవంబర్ 18:53వ జిల్లాస్థాయి బాలల సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక ఈ తక్షిల పాఠశాల ఆవరణలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. సంబంధి త కార్యక్రమాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జిల్లా అదునపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీ, ఎమ్మె ల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
జిల్లాలు నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని ఇందుకు నిదర్శనం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ చూస్తేనే అర్థం అవుతుందని అన్నారు. నారాయణఖేడును వి ద్యాపరంగా, ఇతను మౌలిక వసతులపరంగా అన్ని విధాలుగా అభివృద్ధిలో ముం దుకు తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మొదటి అంకులు సాధించిన ఘనత ఇక్కడి విద్యార్థులకి దక్కిందని ఎమ్మె ల్యే అన్నారు.
విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో రాణించడానికి పరిశోధనలు చేపట్టడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలు వారు తిరిగి చూస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు కృషిచేసిన జిల్లా అధికారులకు వారు అభినందించారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం నుండి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యా ర్థులు సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఇఓ వెంక టేశ్వర్లు, ఆయా మండలాల ఎంఈఓ లు ఇతర విద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సెల్ కార్యక్రమం ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రోజు వారీగా వివిధ పాఠశాలలు చెందిన విద్యార్థులు తమ పరిశోధనలను ప్రయోగాలను ప్రదర్శించడం జరుగుతుందని సైన్స్ ఫెయిర్ నిర్వాహకులు పేర్కొన్నారు.