calender_icon.png 19 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం

19-07-2025 12:00:00 AM

ముఖ్యమంత్రి సహాయనిధితోనే సాధ్యం

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, జూలై 18 (విజయ క్రాంతి): పేద ప్రజలలో కార్పొరేట్ వైద్యం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని 66 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను ఆయన స్వగృహంలో అందజేశారు. 66 మంది లబ్ధిదారులకు రూ. 23,25,500/- ల చెక్కులను పంపిణీ చేశారు.

బాన్సువాడ  మండలం 12 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,39,500/- బాన్సువాడ మున్సిపాలిటీ 13 మంది CMRF లబ్ధిదారులకు రూ. 6,03,000/-,బీర్కూర్ మండలం లో ఇద్దరు CMRF లబ్ధిదారులకు రూ. 45,000/-లు  నసురుల్లబాద్ మండలం లో 08 మంది లబ్దిదారులకు రూ. 2,47,000/-,మొస్రా మండలం ఒక్క లబ్దిదారునికి రూ. 38,000/-,చందూర్ మండలం 5 గురు లబ్దిదారులకు రూ. 1,67,000/-లు,వర్ని మండలం లో 06 మంది లబ్దిదారులకు రూ. 2,69,500/-లు,రుద్రుర్ మండలం ఒక్క లబ్దిదారునికి రూ. 11,000/-,కోటగిరి మండలం లో 9 మంది లబ్దిదారులకు రూ. 3,31,500/-పోతంగల్ మండలం లో 8 మంది లబ్ధిదారులకు రూ. 2,14,000/- లు,మొత్తం నియోజక వర్గం లో 66 మంది  లబ్ధిదారులకు రూ. 23,25,500/-లు పంపిణీ చేశారు.