31-10-2025 01:33:50 AM
 
							-జిల్లా కేంద్రంలోనినిబంధనలకు నీళ్లు
-ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు.. ?
-పట్టించుకోని వైద్య అధికారులు
-కలెక్టర్ స్పందించాలని ప్రజలు డిమాండ్
నిర్మల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యమే ఎజెండాగా నిర్మల్ జిల్లా కేం ద్రంలో నెలకొన్న ప్రవేట్ ఆసుపత్రులు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. పేరుకు కార్పొ రేట్ వైద్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కొన్ని ఆసుపత్రులు రోగుల పాలిట శాపంగా మారుతూ ధనార్ధనేయ సంపాదనగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రవేటు ఆసుపత్రుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.
ఆసుపత్రిలో చేరిన రోగుల భద్రత గాలికి వదిలి సెల్లార్లో వైద్య విధులు నిర్వహిస్తూ అత్యవసర వైద్య అందిస్తున్న జిల్లా వైద్యాధికారులు కలెక్టర్ ఇందులో జోక్యం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా లో నిర్మల్ బైంసా ఖానాపూర్ తదితర పట్టణాలలో కొన్ని ఆస్పత్రులు సెల్లార్ భవనంలో ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న అధికారులు వాటిపై కనీస చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో పేద ప్రజల రోగులనుంచి వైద్యం అందిస్తున్న కొందరు వైద్యులు వైద్య వృత్తి నిబంధనలు అతిక్రమించి ఆస్పత్రులు నిర్వహించడం జరుగుతుంది.
కనీస సౌకర్యాలు లేకపోయినా..?
నిబంధన ప్రకారం కార్పొరేట్ వైద్యశాలలు ఏర్పాటు చేసుకునేవారు 24 గంటల అత్యవసర సేవలతో పాటు, వివిధ విభాగాల వైద్యు లు అర్హత ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు 7 నర్సు లు వైద్య చికిత్సలకు అవసరమయ్యే విశాలమై న గదులు యంత్రాలు తదితర నిబంధనలు పాటించవలసి ఉంది. అయితే నిర్మల్ బైంసా పట్టణాలు కొందరు వైద్యులు ఆసుపత్రికి అరువైన భవనాలను ఎంపిక చేయవలసింది అవి ఎక్కడ కూడా పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భవనం నిర్మించాలన్న ఆ భవనంలో రోగులకు అవసరంగా అన్ని మౌలిక సదుపాయాలపై కల్పించవలసిన ప్రవేటు వైద్యశాలను అక్కడ కనీస సౌకర్యాలు భవంతులు లేకపోయినా ఆసుపత్రులు నిర్వహిస్తూ అందినంత దోచుకుంటున్నారు.
భవనాల కింద పార్కింగ్ స్థలం ఉండగా సెల్లార్ పార్కిం గ్ స్థలం కోసం ఉపయోగించుకోవలసి ఉన్న అందులో ఆసుపత్రులు నిర్వహించడం రోగులకు చికిత్స నిర్వహిస్తున్న సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదు. నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ నుంచి తిరుమల థియేటర్ వరకు ఉన్న హాస్పిటల్ తో పాటు మంచిర్యాల్ చౌరస్తా దివ్య నగర్ బైంసా పట్టణంలోని డాక్టర్ లైన్ తదితర ఆసుపత్రిలో పదుల సం ఖ్యలో సెల్లార్లో వైద్య ఆస్పత్రులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారులు వాటిపై చర్యలకు తీసుకోవడానికి వెనుకడుగు వేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
అనుకోని ప్రమాదాలు జరిగితే.. ?
జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేటు సెల్లార్ భవనాలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రమాదాలు జరిగితే ప్రజల ఆరోగ్య భద్రత ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. డిమాండ్ ఉన్న ప్రదేశాల్లో భవనాలకు కొరత ఉంది ఉండడంతో ఉన్న భవనాలు సరిపోక సెల్లార్లో వైద్య సేవలు విస్తరించి ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. సెల్లార్లో ఆస్పత్రులు నిర్వహించడం వల్ల కింది భాగంలో చీకటిగా ఉండడం వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం ప్రమాదాలు జరిగితే బయటకు వెళ్లలేని పరిస్థితి రేకుల షటర్లు ఉండడం. , వర్షాకాలం వస్తే సెల్లార్లు వర్షపు నీరు రావడం తేమ పగుళ్లు ఉండడం వంటివి ప్రతినిత్యం జరుగుతున్న అధికారులు తనిఖీల్లో వాటిని గుర్తించినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోకపోవడంపై అంతర్యం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్లోని రోగుల చికిత్స పొందే గదులతో పాటు అత్యవసర సేవలైన ఐసిఐసియు ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే ఓపి వంటి సేవలను వినియోగిస్తున్నారు. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇరు కు గదులు ఇబ్బందుల మధ్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవలసి వస్తుంది.
దీనివల్ల వృద్ధు లు గర్భిణీలు అత్యవసర సేవలు వినియోగించుకునేవారు సెల్లార్లో మెట్లు ఎక్కి దిగడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు కూడా గురి అవుతున్నారు. కొన్ని ఆసుపత్రిలో వైద్యశాఖ నిబంధనలు కూడా పాటించకుండా కొందరు వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులను భయభ్రాంతులకు గురిచేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రోగం చెప్పి అందినంత దోచుకుంటున్నారు. ప్రతి రోగికి సిటి స్కానింగ్ ఇతర పరీ క్షల పేరుతో వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో వైద్యుల పేర్లు వారు నిర్వహించే చికిత్సలు ఫీజు వివరాలు అందు లో ఉన్న మౌలిక సదుపాయాలు బోడుపై రాసి ఉంచవలసి ఉన్న అవి ఎక్కడ కనిపించ డం లేదు. విధులు నిర్వహించే సిబ్బంది కూడా అర్హత వారితో వైద్య సేవలు అందిస్తున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఆస్పత్రులపై జిల్లా వైద్య అధికారులు కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నామమాత్రపు తనిఖీలు..
ప్రతి సంవత్సరం ఆసుపత్రులను తనిఖీ చేసి అక్కడ మౌలిక సదుపాయాలపై జిల్లా వైద్య టాస్క్ ఫోర్స్ టీం పనిచేస్తున్నప్పటికీ నామమాత్రపు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలపై కనీస చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు సెల్లార్లో భవనా లు నిర్మించడం వల్ల ఆసుపత్రిలో పార్కిం గ్ స్థలం ముందు పార్కింగ్ స్థలం లేక రోగులు రోగి బంధువులు ప్రజలు వాహనాలను ఆస్పత్రి ముందే పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు కూడా ఇబ్బందిగురవుతున్నారు. ఇప్పటికీ ఆస్పత్రిలో ముందు ట్రాఫిక్ సమస్యపై జిల్లా పోలీసులు మున్సిపల్ శాఖ అధికారులు ఆసుపత్రికి నోటీసులు జారీచేసిన వైద్యులు తమ పలుకుబడి ఉపయోగించుకుని కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.