calender_icon.png 28 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలంతా ఏకం కావాల్సిందే

26-07-2025 12:27:46 AM

  1. రిజర్వేషన్లు సాధించకపోతే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి 
  2. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ 

హైదరాబాద్, జూలై 2౫ (విజయక్రాంతి): బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీ హరి, పార్టీ నేతలతో కలిసి శుక్రవారం మ ంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ  బీ సీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనన్నారు.

బీసీ రిజర్వేషన్లు సాధించడం చేతకాకపోతే రాష్ర్ట బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే ని ర్ణయం తీసుకోవాలన్నారు. బీసీలకు అ న్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని పొన్నం హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలు జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం నాడు మండల్ కమిషన్ తీసుకొస్తే.. అందుకు వ్యతిరేకంగా  బీజేపీ కమండల్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను నిలదీయాలన్నారు. బీజేపీలోని బీ సీలు గొంతు విప్పకపోతే అణిచివేతకు గురవుతారని హెచ్చరించారు.

బీసీలకు న్యాయం చేస్తానని రాహుల్‌గాందీ స్పష్టంగా చెప్పార ని, బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ ఏ పార్టీలో ఉ న్నా బీసీ బిడ్డలు స్వాగతించాలన్నారు. బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ తెలంగాణలో 9% లేనివారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, 56 శాతం ఉన్న తమకు ఎందుకు పరీక్ష పెడుతున్నారని ప్రశ్నించారు.