calender_icon.png 14 September, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక్‌నగర్ డివిజన్‌లో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పర్యటన

14-09-2025 12:20:43 AM

మల్కాజిగిరి, సెప్టెంబర్ 13(విజయక్రాంతి) : వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని బండచెరువు సమీప లక్ష్మీ నగర్ కాలనీ తరుణ్ ఎన్క్లేవ్లో సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శనివారం పర్యటించారు. 120 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో అసోసియేషన్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజల ఆవేదన విన్నారు. డ్రైనేజీ, రోడ్డు, దోమల బెడద, వీధిదీపాలు, పారిశుభ్రత, ట్రాన్స్ఫార్మర్ లోడ్ సమస్యలను స్థానికులు వివరించారు.

వెంటనే ఎలక్ట్రికల్ ఏ.ఈ శ్రీనివాస్తో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచాలని ఆదేశించారు. దోమల సమస్యల పరిష్కారం కోసం ఏంటమాలజీ ఏ.ఈ వనజను సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ స్ట్రీట్ లైట్స్ వెంకటేష్, కాలనీ ప్రెసిడెంట్ జయ కుమార్, సెక్రటరీ సురేష్, కమిటీ సభ్యులు, ఈస్ట్ ఆనంద్ బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కోశాధికారి రవికుమార్, బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, గోపాల్ యాదవ్, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.