09-01-2026 12:00:00 AM
వనపర్తి/హనుమకొండ, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై శ్రీకాంత్ పేకాట కేసులో పట్టుబడ్డ నిందితుడిని తప్పించేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా గురువారం తన వ్యక్తిగత డ్రైవర్ ఎండి నజీర్ నుంచి స్వీకరిస్తున్న సమయంలో హనుమకొండ ఏసీబీ అధికారులు ఎస్సైతో పాటు తన డ్రైవర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వనపర్తి జిల్లా పౌరస రఫరాల సంస్థ కార్యాలయంలో డీఎంగా జగన్మోహన్ పనిచేస్తున్నాడు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ.లక్ష డ్బ్బు వేలు డిమాండ్ చేశాడు. బాధితుడుతో రూ.50 వేలకు బేరం కుదరడంతో ఒప్పందంలో భాగంగా గురువారం వనపర్తిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ ఐడిఓసి కార్యాలయ ఆవరణలో తన కారులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.