calender_icon.png 11 January, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరం ఆలోచనలను రేకెత్తిస్తుంది

09-01-2026 12:00:25 AM

  1. కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి

విద్యార్థుల ఆలోచనలకు సృజనాత్మకత జోడించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్

విద్యార్థుల ప్రదర్శనలను  తిలకించి విద్యార్థులతో చర్చించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జనవరి 8 (విజయక్రాంతి): అవసరం ఆలోచనలను రేకెత్తిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి విద్యానికేతన్ హై స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ పేరు ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన స్థాలను పరిశీలించి విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించే దిశగా నిరంతరం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయంకి ప్లాస్టిక్ వ్యతిరేకతకు అలాగే రాబోయే తరాల సస్యశ్యామలత్వానికి అవసరమైన ఆవిష్కరణలను చేయాల్సిన గురుతుల బాధ్యత భావిభారత సమాజంప నేటి విద్యార్థులపైనే ఉన్నదన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యావ్యవస్థ పని చేయాలని సూచించారు.

53వ జాతీయ బాల వైజ్ఞాని ప్రదర్శనలో భాగంగా నేడు కామారెడ్డి లో జరిగిన రెండవ రోజు సైన్స్ ఫెయిర్ కామారెడ్డి ప్రాంత విద్యార్థులలో నూతన పోకడల పట్ల ఆసక్తిని మరియు ఆవిష్కరణల ఆవశ్యకతను తెలియజేసింది. కామారెడ్డి పరిసర ప్రాంతాలలోని సుమారు 8,000 మంది విద్యార్థులు నేడు ప్రదర్శనను తిలికించి రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి ఎనిమిది వందల ఎనభై ప్రదర్శనలను పరిశీలనాత్మకంగా పరిశీలించి కొత్త ఆలోచనలను తెలుసుకోవడమే కాకుండా తాము కొత్త ఆలోచనలను ఏ విధంగా చేసుకోవచ్చు స్ఫూర్తి పొందడం జరిగింది.

ఈకార్యక్రమానికి కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు విచ్చేసి ప్రదర్శనలను తిలకించడమే కాకుండా వ్యక్తిగతంగా ఒక్కొక్క విద్యార్థిని ప్రదర్శన పట్ల అవగాహనను పరిశీలిస్తూ ఆ ప్రదర్శనకు ఆలోచనను ఏ విధంగా పొందారో చర్చించడం జరిగింది.

దేశ్పాండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇండియా నుండి మొట్టమొదటగా అమెరికా వెళ్లి ఇంటర్ ప్రిన్యూర్ నో చేపట్టడమే కాకుండా ఎంతోమంది నూతన స్టార్ట్ అప్పులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి కల్నల్  నేటివ్ ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను ఉత్తేజపరిచి ఆవిష్కరణల ఆవశ్యకతను దానిని సమాజానికి ఏ విధంగా పరిచయం చేయగలమనే విషయాన్ని తెలిపారు. 

 ఆగస్టు ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆగస్ట్రా ఫౌండేషన్ ప్రతినిధి రాజిరెడ్డి  విద్యార్థులకు వివరించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. విద్యార్థులు పాఠ్యాంశ కార్యక్రమాల ప్రదర్శనలే కాకుండా సుమారు 25 పాఠశాలల నుండి నమోదైనటువంటి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోవడమే కాక ఆలోచన రేకెత్తే విధంగా అంగరంగ వైభవంగా రెండవ రోజు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసినటువంటి గైడ్ ఉపాధ్యాయులు జడ్జిమెంట్ కొరకు విచ్చేసిన జ్యూరీ మెంబర్లు విజయవంతంగా జరిపినారని జిల్లా సైన్స్ అధికారి సిద్ధి రామ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి  రాజు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ హై స్కూల్ ఫౌండర్ కవి, పాఠశాల ప్రిన్సిపల్ జుబేర్, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.