calender_icon.png 23 November, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అనకొండ సుధీర్‌రెడ్డి

10-02-2025 12:50:55 AM

 వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుట్ల నర్సింహయాదవ్

ఎల్బీనగర్, ఫిబ్రవరి 9: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అనకొండ అని.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలతో వేల కోట్లకు ఎదిగాడని  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మధుయాష్కీగౌడ్‌పై బీఆర్‌ఎస్ నాయకులతో ఎమ్మెల్యే ఆరోపణలు చేయించడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, పాశం అశోక్ గౌడ్, ఎల్బీనగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ మాధవి తదితరులు ఆదివారం వనస్థలిపురంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి ఎల్బీనగర్ నుంచి మణికొండ వరకు ఉంద న్నారు. అవినీతి డబ్బుతో పెద్ద విల్లాలో విలాస జీవితాన్ని ఎమ్మెల్యే అనుభవిస్తున్నా రన్నారు. సీఐలు,  ఏసీపీలను పోస్టింగ్ ల్లో డబ్బులు వసూలు చేసిన చరిత్ర సుధీర్ రెడ్డిది అని.. ఆ అవినీతి మరకను మధుయాష్కీపై మీదకు తోసేయాలని చూస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్ దగ్గర డబ్బులకు అమ్ముడుపోయి..  ఓట్లు వేసిన ప్రజలను, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ ను వీడి బీఆర్‌ఎస్ లోకి వెళ్లాడని విమర్శించారు.  మూసీ సుందరీకరణ పేరిట కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. ఎల్బీనగర్‌లోని ఏ చెరువు స్థలమైనా.. ప్రభుత్వ భూమైనా.. కబ్జాకు  గురైం దంటే అందులో సుధీర్ రెడ్డి, ఆయన అనుచరుల పాత్ర ఉందన్నారు.

వనస్థలిపురంలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అనుచరులకు కేటాయించడం, నందనవనంలోని వాంబే గృహాల్లో సుధీర్ రెడ్డి తన అనుచరులతో కబ్జా చేయించారని ఆరోపించారు. ఫతుల్లగూడ సర్వే నెంబర్ 58 లోని ప్రభుత్వ స్థలాలను తన అనుచరులకు ఏ విధంగా కట్టపెట్టాడో అందరికీ తెలుసన్నారు.

మధు యాష్కీ మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న నేత అని..  ఓడినా గెలిచినా ప్రజల కోసమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. అవాస్తవాలతో ఆరోపణలు చేస్తే మేము సుధీర్ రెడ్డి అవినీతిపై వాస్తవాలతో రెండింతలు చెప్పగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు శ్రీను, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.