10-02-2025 12:48:26 AM
సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య
ఎల్బీనగర్, ఫిబ్రవరి 9: వనస్థలిపురం రైతు బజార్ చిరు వ్యాపారస్తులను కాపాడాలని వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు సీఐటీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. వనస్థలిపురం రైతు బజార్ దగ్గర సీఐటీయూ ఎల్బీనగర్ నగర్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్ తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులు, కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య అధ్యక్ష నిర్వహించారు.
సమావేశంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా వనస్థలిపురం రైతు బజార్ ఎదుట చిరు వ్యాపారం చేసుకుంటూ దాదాపు 130 కుటుంబాలు జీవనం సాగిస్తున్నార న్నారు. ఐదు నెలల క్రితం ట్రాఫిక్ సమస్య ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారు లు రైతు బజార్ ఎదుట ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, తోపుడుబండ్లను తొలిగించారని తెలిపారు.
దీంతో వారు రోడ్డున పడ్డారని, ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వీరు సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ ఎల్బీనగర్ ఇంచార్జి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను కోరినట్లు చెప్పారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం ఉంచాలని కోరినట్లు వివరించారు.
దయచేసి రాజకీయాలను చిరు వ్యాపార స్తులపై రుద్దవద్దని, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు, వ్యాపారులు భారతమ్మ, చిన్న శ్రీను, కోటేశ్వరరావు, జయమ్మ, నరసమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.