14-11-2025 12:00:00 AM
రూ.75 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీపీవో, టీపీఏ
ఇబ్రహీంపట్నం, నవంబర్ 13: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్.. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ ద్వారా ఓ బిల్డింగ్ అనుమతి విషయంలో రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మునిసిపాలిటీ పరిధిలో ఓ ఇంటి అనుమతి కోసం మోత్కూరి ఆనంద్ అనే వ్యక్తి నుంచి 400 గజాల్లో 4 అంతస్తుల కోసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని టీపీవో వరప్రసాద్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రమించాడు. రూ. 80 వేలకు కుదుర్చుకున్న ఒప్పందంలో రూ.75 వేలు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.