calender_icon.png 10 January, 2026 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ అభివృద్ధి శాఖపై అవినీతి మరక

07-01-2026 12:05:50 AM

అసెంబ్లీ సాక్షిగా ఆరోపించిన ఎమ్మెల్యే హరీష్‌బాబు 

డీఆర్డిఓపై విమర్శల వెల్లువ 

ఉన్నతాధికారులకు, మంత్రులకు చెప్పిన ప్రయోజనం సున్నా

ఆ శాఖలో ప్రక్షాళన ఉంటుందా?

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 6(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు ను అందించే గ్రామీణ అభివృద్ధి శాఖపై అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధికి కేటాయించిన నిధులు సైతం సకాలంలో వినియోగించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లడంపై ఏకంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సాక్షిగా డిఆర్డిఓ పై విమర్శలు గుప్పించారు.

ఆ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఈ విషయంపై కమిషనర్, సెల్ఫ్ సీఈవో ఇన్చార్జ్‌గా కొనసాగిన మంత్రి సీతక్క, ప్రస్తుత ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావుకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేవని స్పీకర్ దృష్టికి తీసు కువెళ్లిన సంఘటనతో జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామీణ అభివృద్ధి సంస్థ పనితీరుపై చర్చ జరుగుతుంది. మార్చ్ 23న ప్రొసీడింగ్ లు జారీ చేసి వారం రోజుల్లో పనిచేయాలని లేకపోతే కుదరదని డిఆర్డిఓ చెప్పడంతో సిర్పూర్ నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల నిధు లు వెనక్కి వెళ్లిన పరిస్థితి నెలకొందని సదరు అధికారి అవినీతి పరుడే కాకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే ఆరోపించారు.

అభివృద్ధికి అధికారుల నిర్లక్ష్యమా ...?

వెనుకబడ్డ జిల్లాగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మరింత అభివృద్ధిలో వెనుకడుగు పడుతుందా అనే ప్రశ్న లు ఉత్పన్నం అవుతున్నాయి. జిల్లాకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడమే ఎందుకు కారణమా...? పలు శాఖలో అధికారులు సైతం విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడంతోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు న్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతు న్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

అవినీతి అక్రమాలలో పెద్ద తలలు....!

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాల వెనుక పెద్దతలలు ఉన్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ అభి వృ ద్ధి సంస్థ ద్వారా చేపట్టిన పనులలో నాణ్యత లోపించిందని ఆరోపణలు ఉన్నా యి. దీంతోపాటు అధికారుల సహకారంతో కొంతమంది రాజకీయ అండదండలు ఉన్నవారు పనులు చేపట్టకుండా బిల్లులు లేపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పక్షపాతంగా ప్రభుత్వం విచారణ చేపడితే ఎన్నో లోపాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అభివృద్ధి పనులపై నిఘా విభాగం సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని సమాచారం. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పను ల తీరుపై ఆయా శాఖలలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అవినీతి పై ప్రసంగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

అసెంబ్లీలో గ్రామీణ అభివృద్ధి శాఖలో జరుగుతున్న అవినీతిపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లేవనెత్తిన అం శాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్వయంగా ఎమ్మెల్యేనే ఓ జిల్లా స్థాయి అధికారిపై అసెంబ్లీలో చర్చించడం చూస్తే జిల్లాలో ఏ మేరకు అవినీతి ,అక్రమాలు రాజ్యమేలుతున్నాయో తెలుస్తుంది. ఇప్పటికైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

దుర్గం దినకర్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు