calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి

19-09-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, సెప్టెంబర్ ౧8 (విజయక్రాంతి):   పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదు పాయాలు కల్పించాలని ఆదేశించారు. అలా గే పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-- జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపా రు. రైతులు సహకరించి కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా వినియోగించుకో వాలని కలెక్టర్ కోరారు.

అనంతరం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, ఎడి మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డిఎస్‌ఓ రాజేందర్, డిఎం సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.