24-12-2025 02:00:22 AM
బాన్సువాడలో కలకలం రేపిన దొంగ నోట్ల కథ ముగింపు
బాన్సువాడ, డిసెంబర్ 23 (విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కలకలం సృష్టించిన నకిలీ నోట్ల ముఠా కేసును వర్ని పోలీసులు చేదించారు. మూడు రోజుల క్రితం వర్ని కెనరా బ్యాంకుకు జలాల్పూర్‌కు చెందిన చిన్న సాయిలు పంట రుణం కట్టడానికి తీసుకువచ్చిన రూ. 2,08,500 విలువ గల నోట్లు నకిలీవని తేలడంతో ఆయన బ్యాంకు నుంచి పరార య్యాడు. బ్యాంక్ మేనేజర్ పంకజ్ కుమార్, బ్యాంకు అధికారులు వర్ని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఏ1 రవి కుమార్‌రెడ్డి, ఏ2 ఆకాష్ రమేష్ జాదవ్ వారి మనుషుల ద్వారా నాలుగు లక్షల నకిలీ నోట్లు తీసుకుని వికారాబాద్ రాగా వాటిలోంచి ఏ4 నుంచి ఏ8 అను వ్యక్తులు కొన్ని నకిలీ నోట్లను చెలామణి చేసి మిగతా రూ.2,08,500 లను శంకర్ అను వ్యక్తి చిన్న సాయిలు ఇంటిలో చిన్న సాయిలుకు తెలవకుండా దాచిపెట్టాడు.
తదుపరి ఏ2, ఏ3 లను విచారించగా ఏ2 ఆకాష్ రమేష్ జాదవ్ అను అతను ఏ1 రవి కుమార్ రెడ్డి ర జడ్చర్ల తో కలసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి హైదరాబాద్ కు తీసుకువెళ్ళే క్రమంలో బోధన్ బస్టాండ్ వద్దకు వచ్చినప్పుడు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.9,86,000 నకిలీ నోట్లను, రెండు ప్రింటర్స్‌ను, ఒక లాప్టాప్, 3 సెల్ ఫోన్స్, నాలుగు బ్లేడ్లు, రెండు స్టీల్ స్కేల్స్, ఒక ఆకుపచ్చ ప్లాస్టిక్ రోల్ పేపర్ స్వాధీనం చేసుకున్నారు. ఏ4 నుంచి ఏ8 వద్ద 5 సెల్ ఫోన్స్, ఏ8 వద్ద బ్రీజా కార్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో రవికుమార్‌రెడ్డి ఆకాష్ రమేష్ జాదవ్, శివాజీ ధండేనగర్ కాలనీ, మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ పట్టణం, ప్రస్తుత మహా రాష్ట్రంలో హింజువాడి పూణే నగరం. మహాదేవ్ మంచిక్ మోర్, మోరేవస్తి కాలనీ, దేవ్గావ్ గ్రామం, కెగ్ తాలూకా, బీడ్ జిల్లా. యొక్క మా రాష్ట్ర. హనుమాన్ మందిర్ పూణే, మహారాష్ట్ర, సమీపంలోని ప్రస్తుత నావెల్ వంతెన ఊడ్గావ్ బుధ్రుక్ పాల్త్య కళ్యాణ్ అఫంధి ఫారం గ్రామం,
వర్ని మండలం ఎల్తం నరెడ్ల శంకర్, జలాల్పూర్ గ్రామం, వర్ని మండలం సతోజి గోపాల్ చందూర్ గ్రామం, మండలం, ప్రస్తుత కోటయ్య క్యాంప్ వర్ని మండలం. ఎల్తెం రవి, జలాల్పూర్ గ్రామం, వర్ని మండలం నరెడ్ల బాలయ్య బాలు జలాల్పూర్ గ్రామం, వర్ని మండలం.