18-08-2025 12:49:44 AM
నియామకాల్లో తీవ్ర జాప్యం
ఇన్చార్జిల తీరుపై తీవ్ర అసంతృప్తి
మేడ్చల్, ఆగస్టు 17(విజయ క్రాంతి): మే డ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారు. నామినేటెడ్, పార్టీ పదవులు ఇదిగో, అదిగో అంటూ ఊరిస్తున్నారే గాని భర్తీ చేయకపోవ డం తో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల జాబితా అధిష్టానం వద్ద ఉం దని, ఆమోదం పొందగానే ప్రకటిస్తారని వా ర్తలు వెలుపడ్డాయి. కానీ అధిష్టానం తీవ్రకాలయాపన చేస్తోంది.
అసలు ప్రస్తుత పరి స్థితుల్లో నామినేటెడ్, పార్టీ పదవులు ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆశిస్తున్నా రు.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పా ర్టీలో చేరిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపె ద్ది సుధీర్ రెడ్డి కి, మేడ్చల్ టికెట్ ఆశించిన డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన న ర్సారెడ్డి భూపతిరెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన సత్యం శ్రీరంగం తదితరులకు ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి ఎమ్మెల్సీ, నా మినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పూన శ్రీశైలం గౌడ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహ న్ తదితరులు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. బొంతు రామ్మోహన్ కు సి కింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వివిధ సమీకరణల వల్ల టికెట్ ఇవ్వలేకపోయారు. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు ఆశిస్తున్నారు.
ప్రభుత్వం ఇంతకుముందు వివిధ కార్పొరేషన్లకు చైర్మ న్ లను నియమించినప్పటికీ డైరెక్టర్లను నియమించలేదు. గతంలో నియమించిన, త్వరలో నియమించబోయే కార్పొరేషన్లలో పెద్ద మొత్తంలో డైరెక్టర్ పదవులు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి రెండు పదవులు ఇవ్వనున్నారు. మేడ్చల్ జిల్లాకు గతంలో జరిగిన నియామకాల్లో తగిన ప్రాధాన్యం లభించలేదు. పీసీసీ కార్యవర్గంలో ముగ్గురికి మాత్రమే పదవులు లభించాయి.
నియోజకవర్గానికి రెండు డైరెక్టర్ పదవులు ఇస్తే మే డ్చల్ జిల్లాకు 10 పదవులు వస్తాయి. జిల్లా లో మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు ఎక్కువగా లేవు. డైరెక్టర్ పదవుల తోటే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నామి నేటెడ్ పదవుల్లో అవకాశం రాని వారు పార్టీ పదవులను ఆశిస్తున్నారు. పార్టీ సంస్థాగత జిల్లా ఇన్చార్జిగా అధిష్టానం శివసేనారెడ్డిని నియమించింది. ఆయన ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదు.
ఇన్చార్జిల తీరుపై తీవ్ర అసంతృప్తి
మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలుపొంది అధికారంలోకి వచ్చినప్పటికీ మేడ్చ ల్ జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. కొన్నిచోట్ల గెలిచే అవకాశం ఉన్నప్ప టికీ అభ్యర్థుల అతి విశ్వాసం, నిర్లక్ష్యం వల్ల ఓడిపోయారు. ప్రస్తుతం ఇన్చార్జిలుగా వారే వ్యవహరిస్తున్నారు.
నియోజకవర్గంలో వారి మాటే చెల్లుబాటు అవుతోంది. వీరిపై క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇన్చార్జీలు కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవడం లేదు. ఒంటెత్తు పోకడలకు పోతు న్నారు.
అందరినీ కలుపుకొని పోవడం లేదు. గతంలో 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీలో ఉన్నామని, ప్రస్తుతం అధికారంలో ఉన్న తమకు సంతో షం లేకుండా పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్చార్జీలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనందున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల త్యాగాలు తెలియడం లేద ని అంటున్నారు.
ఇన్చార్జిల నిర్లక్ష్యం వల్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా మారు తోందని, ప్రజలు సీఎంఆర్‌ఎఫ్, ఇతర పనులకు వారి వద్దకే వెళుతున్నారని అంటు న్నారు. ఇన్చార్జీలు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉం దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు అందరూ సమావేశమై అధికారులు తమ మాట వినడం లేదని వాపోయారు. పరిస్థితి ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది.