calender_icon.png 4 January, 2026 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ చెరువు ఆక్రమణలపై కోర్టు సీరియస్

03-01-2026 01:22:14 PM

వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం

కోదాడ: కోదాడ పెద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి సీరియస్ అయ్యింది. పెద్దచెరువు ఆక్రమణలపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్త లపై సుమోటోగా కేసు నెం: (125/2023) కేసు నమోదు చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,చెన్నై (సౌత్ జోన్) ఆక్రమణదారులకు తాజాగా నోటీసులు జారీచేసింది. వీరంతా నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. గతేడాది దీనిపై రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుద లశాఖ అధికారులతో సంయుక్త సర్వే చేయించారు. రిపోర్టు ప్రకారం చెరువులో ఉన్న శిఖం, ఎఫ్ఎఎల్, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి వీరందరికి నోటీసులు జారీచేశారు.