03-01-2026 01:19:35 PM
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె సేవలను మననం
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): 1848 జనవరి 1న పూణేలో బాలికల కోసం తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి, కుల వివక్ష, వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన దీరశాలి సావిత్రిబాయి పూలే అని, మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, సంఘ సంస్కర్తగా మరియు కవయిత్రిగా ఆమె పేరుగాంచారన్నారు. స్త్రీ విద్య, దళిత అభ్యున్నతికి కృషి చేశారని సతీసహగమనం, బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.