03-01-2026 01:24:16 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని చిన్న ఓదాల గ్రామంలో సర్పంచ్ నాగుల శారద రాజయ్య అధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పాలాభిషేకం చేశారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కు దూప దీప నైవేద్యం పథకం మంజూరు చేసినందుకు మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం గ్రామపంచాయతీ ఆఫీస్ ముందు శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.