calender_icon.png 8 July, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవధను నిషేధించాలి

08-07-2025 01:58:47 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

 ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి):  పార్లమెంట్‌లో గోవధ నిషేధ చట్టం తెచ్చేందుకు ఒత్తిడి తెస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నమో మిషన్ వందే గౌమాతరం సంస్థలో తెలంగాణకు చెందిన కీర్చిపల్లి రాజు యూఎస్‌ఎ ఎంపవర్‌మెంట్ వింగ్‌కు వ్యవస్థాపక సభ్యుడు అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆర్  కృష్ణయ్య రాజును అభినందించి మాట్లాడారు. గో ఆధారిత సేంద్రియ ఉత్పత్తులతోనే దేశానికి పునర్వుభైవం వస్తుందన్నారు. దేశంలో గో ప్రధాన్యత తగ్గి నప్పటి నుంచి అనేక కొత్త కొత్త రోగాలు సంక్రమిస్తున్నాయని అన్నారు. గోవధ నిషేధ చట్టం కోసం కృషి చేస్తానని చెప్పారు.

ఈ సమావేశంలో సంస్థ కో-ఫౌండర్ కవిత హైందవి, గో మఠ మిషన్ చైర్మన్ మాధ్వి రాజ్, సుధాకర్, జిల్లపల్లి అంజి, వైబవ్, సూర్య నటుడు పూర్ణ చందర్, సాయి, చింటు, భరత్ గౌడ్, సుదర్శన్, సూర్య, మంజు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.