10-09-2025 01:10:22 AM
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి) : ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే కుట్ర బీజేపీ పార్టీ చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ బ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ ,హర్యానాలో మొట్టమొదటిగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని అన్నారు.
బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోంది, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు.ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవా ల్సిందేనని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయం అని అన్నారు. పూర్తిగా మలాల ఉనికిని కోల్పోక ముందే శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం సత్యనారాయణ, తెలంగాణ కన్వీనర్ బల్లెం లక్ష్మణ్ నెల్లి సూరిబాబు, తెలంగాణ జనరల్ సెక్రటరీ కామా ప్రభాకర్ కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.