calender_icon.png 10 September, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ శ్రీధర్‌కు అభినందనల వెల్లువ

10-09-2025 01:13:53 AM

  1. భారీ వర్షాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న యువతిని రక్షించి, ఇంటికి చేర్చిన వైనం

విధికి మించిన సేవంటూ అభినందన పత్రం అందజేత

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 9(విజయక్రాంతి): విధి నిర్వహణలో ఓ పోలీస్ అధికారి చూపిన అసమాన మానవత్వానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  సలాం చేసింది. గత వారం నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాల సమయం లో, వరద నీటిలో ప్రాణభయంతో విలవిలలాడుతున్న ఓ యువతికి అండగా నిలిచి, ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాద్ సిటీ ఆరమ్డ్ రిజర్వ్  హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మను మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవను కొనియాడుతూ అభినందన పత్రం అందజేశారు.