10-09-2025 01:13:48 AM
ఎమ్మెల్సీ అద్దంకి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గోదావరి నీళ్లను మూసీకి తీసుకొస్తామంటే బీఆర్‌ఎస్ నేతలకెందుకు కడుపు మంట అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలను మూసీ మురికి నుంచి విముక్తి చేస్తామంటే బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు అడ్డుపడు తున్నారని మండిపడ్డారు.
కవిత విమర్శలకు సమాధానం చెప్పలేని కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. మంగళ వా రం ఆయన సీఎల్పీ కార్యాలయం లో మాట్లాడుతూ.. మూసీని పక్షాళన చేస్తామంటే బీజేపీ వాళ్లు మూసీ లో పడుకుంటున్నారని విమర్శించారు. మూసీకి కొండపోచమ్మ సాగర్ నుం చి నీళ్లు తీసుకుంటే 5 చోట్ల పంపింగ్ చేయాలని, అదే మల్లన్నసాగర్ నుంచి తీసుకుంటే రెండు చోట్ల మాత్రమే పంపింగ్ చేయాల్సి ఉంటుందని, ఖర్చూ తగ్గుతుందన్నారు.