calender_icon.png 5 December, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందల్వాయి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య

05-12-2025 12:08:47 AM

ఇందల్వాయి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గురువారం అందాల్వాయిలో గల టోల్ ప్లాజా బార్డర్ ఇంటర్ డిస్టిక్ చెక్పోస్ట్ ను. అకాస్మికంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య తనిఖీ చేశారు.  టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఆయన సందర్శించరూ. ఈ సందర్భంగా కమిషనర్ విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం, ఆయుధాలు, అలాగే అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు కఠినంగా నిర్వహించాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ప్రజలు భయభ్రాంతిలేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్ టీమ్ ఇంచార్జ్ సాయి కుమార్, రవీందర్, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.