calender_icon.png 5 December, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిలింగ రామేశ్వరాలయ ఆవరణలో ప్రత్యేక పూజలు..

05-12-2025 12:17:37 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): దత్త జయంతి మహోత్సవం నాగిరెడ్డిపేట మండలంలోని  తాండూర్ త్రిలింగ రామేశ్వర దేవాలయ ఆవరణలో రామస్వామి దేవుని సన్నిధిలో కొలువైన దత్తాత్రేయ స్వామి మందిరంలో ఆలయధర్మకర్తలు కొమ్మ శ్రీనివాస్,కొమ్మ దత్తు దంపతుల భక్త మండలి, గ్రామస్థుల ఆధ్వర్యంలో దత్త జయంతి  ఉత్సవాలు ఘనంగా జరుపబడినాయి.

ఈ సందర్భంగా గ్రామం నుంచి దేవాలయం వరకు కాషాయ జెండా ఊరేగింపు మరియు దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు హోమం, ధుని పూజ, అవధంబర వృక్ష పూజ, అదేవిధంగా కాషాయ జెండా ధ్వజారోహణం భక్తుల భజన కార్యక్రమాల మధ్య చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు  అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

భక్తుల దత్త దిగంబర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.  ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మల్లికార్జున అప్ప,గ్రామ పెద్దలు శ్యామ్ రావు,రాజ దాసు, బెస్త కిషన్, ఎరుమల్లి దత్తు, తుమ్మల చంద్రమోహన్, కమ్మరి వెంకయ్య, గుడాల శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, మహిళలు, భక్తులు  పాల్గొన్నారు.