calender_icon.png 5 December, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక స్థిరత్వానికి మార్గాలెన్నో!

05-12-2025 12:18:47 AM

చిటికెన కిరణ్ కుమార్ :

* అమెరికా లాంటి దేశం వ్యాపారాన్ని తన ఆర్థిక శ్వాసగా మార్చుకుంది. చిన్న ఆలోచనతో పెద్ద పరిశ్రమగా ఎదిగే అవకాశాలు అక్కడ విస్తృతంగా పెరిగాయి. శ్రమ, పరిశోధన, కొత్త ఆలోచన.. ఈ మూడింటి కలయికతోనే అక్కడ సంపద సృష్టి వేగం పుంజుకుంది. 

ఒక దేశం నిజంగా గొప్పదిగా నిలబడాలంటే దానికి బలమైన సైన్యం ఉండాలి, ఎత్తున భవనాలు ఉండాలి, భారీ పరిశ్రమలు ఉండాలి అనుకునే రో జులు పోయాయి. ఇప్పుడు దేశం ఎంత స్థిరంగా తన ప్రజల జీవనాన్ని నడిపించగలుగుతోంది అన్న ప్రశ్నే అసలైన కొలమా నంగా తయారయ్యింది. సంపద ఉండటం ఒక్కటే సరిపోదు. ఆ సంపద ఎన్ని చేతుల్లోకి వెళ్తోంది, ఎన్ని జీవితాలకు వెలు గునిస్తోంది, ఎన్ని కన్నీళ్లను తుడుస్తోంది అ న్నదే దేశ బలానికి అసలైన తూకం.

ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం ప్రభుత్వ పథకాల కాగితాల్లో కనిపించే మాట కాదు. అది పొలం మీద పని చేసే రైతు చెమటలో, కర్మాగారంలో తిరిగే కార్మికుడి శ్రమలో, చ దువుకుంటున్న విద్యార్థి కలల్లో, చిన్న వ్యాపారి ఆశల్లో ఉండే జీవన సత్యం. ఏ దే శమైనా అక్కడ ఆర్థిక స్థిరత్వం ఉంటేనే దా దాపు అన్ని రంగాలు గాడిలో నడుస్థాయి, లేకపోతే అంతా జారిపోతుంది. డబ్బు ఉం టేనే దేశం బాగుంటుందనేది ఒక కోణమయితే.. ఆ డబ్బు ఎలా పుడుతోంది, ఎవరి చేతిలో తిరుగుతోంది, ఎంతమందికి ఉపయోగపడుతోంది అనేది మరొక కోణం.

రోడ్ల మీద పరిగెత్తే వాహనాల శబ్దం, మా ర్కెట్లో వినిపించే గోల, కర్మాగారాల్లో తిరిగే యంత్రాల శబ్దం.. ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక రంగానికి ఊపిరి పోస్తున్నాయి. ఒక దేశానికి బలమైన పునాది భూమి, నీరు, సహ జ వనరులు మాత్రమే కాదు. వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న మనిషి శ్రమ కూ డా ఒక మూలమే. పని చేసే చేతులు తగ్గితే సంపద సృష్టి ఆగిపోతుంది. సంపద సృష్టి ఆగితే కుటుంబాలు కుంగిపోతాయి.

కు టుంబాలు కుంగిపోతే సమాజం నలిగిపోతుంది. అందుకే ఆర్థిక స్థిరత్వం అనేది ప్ర భుత్వ లెక్కల వరకే పరిమితం కాకూడదు. పొదుపు ఉన్న చోట ధైర్యం ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉన్న చోట భయం ఉంటుంది. ఉత్పత్తి పెరిగిన చోట ఆశ ఉంటుంది, అప్పులు పెరిగిన చోట ఆందోళన ఉంటుందనడంలో సందేహం లేదు.

సమాన సంపదేదీ?

మన చుట్టూ చూసుకుంటే ఏ దేశమైనా తన ఆర్థిక బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్న మే చేస్తోంది. వ్యవసాయం నుంచి బడ్జెట్ దాకా అంతా ఒకే గొలుసులో కట్టుబడి ఉంటుంది. రైతు పంట వేస్తేనే ఆహారం వస్తుంది, ఆహారం ఉంటేనే జనం ఆరోగ్యం గా ఉంటారు, జనం ఆరోగ్యంగా ఉంటేనే పని సాగుతుంది, పని సాగితేనే ఆదాయం వస్తుంది. ఈ చక్రం ఆగకుండా తిరిగితేనే ఆర్థిక స్థిరత్వం కుదురుగా ఉంటుంది. వ్యాపారం అనే రక్త ప్రసరణ లేకపోతే ఈ వ్యవస్థ నిస్సత్తువగా మారుతుంది.

చిన్న దుకాణం పెట్టుకునేవాడయినా, పెద్దపెట్టుబడి పెట్టేవాడయినా.. అంతిమంగా ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. చదువు కూడా అంతే కీలకం. అక్షరం తెలిసిన వా డు కొత్త మార్గం చూసుకుంటాడు, అలోచన పెరిగిన వాడు కొత్త అవకాశమే సృ ష్టిస్తాడు. ఈ మధ్య సేవా రంగం పెద్దగా పెరిగింది. రవాణా, వైద్యం, విద్య, సమాచారం, పర్యాటకం.. ఇవన్నీ కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కొందరు సరిహద్దులు దాటి పని చేస్తున్నా, వాళ్లు పంపించే సంపాదన కూడా ఇక్కడ ఎన్నో కుటుంబాలకు ఆధారంగా నిలుస్తోంది.

ప్రకృతి వన రులు, మానవ శక్తి, వ్యాపార దోహదం, సేవా రంగం.. ఇవన్నీ కలిసిన చోట ఆర్థిక బలం పటిష్టంగా తయారవుతుంది. తొందరగా పెరిగే బంగారం కన్నా, నెమ్మదిగా పెరిగే ధాన్యమే ఎక్కువకాలం నిలబడతుందన్న సత్యం ఇక్కడ వర్తిస్తుంది. అయితే ఈ ప్రయాణంలో కనిపించని చీలికలు కూడా ఉన్నాయి. సంపాదన పెరుగుతుందని చె ప్పుకుంటున్నా, ఆ సంపాదన అందరికీ సమానంగా చేరడం లేదు. అవసరానికి మించి ఖర్చు చేసే అలవాటు పెరిగిపోతోం ది.

అప్పు మీద జీవితం నడిపే పరిస్థితులు ఇంటింటా కనిపిస్తున్నాయి. వినియోగం పెరుగుతోంది కానీ పొదుపు తగ్గిపోతుంది. చదువుకున్న యువతకు పనులు దొరకడం కష్టమవుతోంది. కొన్ని రంగాల్లో ఉ న్న పనులకు కావాల్సిన నైపుణ్యం వాళ్లకు లేదని అంటారు, కానీ ఆ నైపుణ్యం అం దించే దారులు అంతగా విస్తరించడం లే దు. గ్రామాల్లో ఉపాధి తగ్గిపోతే పట్టణాల మీద భారం పెరుగుతుంది.

పట్టణాలు ఉక్కిరిబిక్కిరయితే పనుల విలువ పడిపోతుంది. మరోవైపు ప్రకృతిని ఇష్టమొచ్చిన ట్టు వాడుకుంటే రేపటి జీవనానికి మూడుపూటల ఆహారమే అనిశ్చితమవుతుంది. అ డవులు తగ్గితే వర్షాలు తగ్గుతాయి.. నీరు తగ్గితే పంటలు ఎండుతాయి.. పంటలు ఎండిపోతే ఆర్థిక సమతుల్యత కూలిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు కనిపించకపోయి నా, నెమ్మదిగా లోపలే పేరుకుపోతున్న ఆర్థిక ముప్పుగా గ్రహించాలి.

దేశం నిలబడాలంటే..

ఆర్థిక స్థిరత్వమనేది ఎవరో కూర్చుని నిర్మించేది కాదు, మనందరం కలిసి రోజూ చేసే పనుల నుంచే తయారవుతుంది. రైతు తన విత్తనాన్ని నమ్మితే, కార్మికుడు తన శ్రమను నమ్మితే, విద్యార్థి తన కలలను నమ్మితే, వ్యాపారి తన నిజాయితీని నమ్మి తే.. అప్పుడే ఆ దేశం నిలబడుతుం ది. అవసరానికి తగ్గ ఖర్చు, భవిష్యత్‌కు ఉపయో గపడే పొదుపు, పనిపట్ల గౌరవం, ప్రకృతి పట్ల జాగ్రత్త, చదువు పట్ల నిబద్ధత.. ఇవే ఆర్థిక బలానికి నిజమైన పరిష్కారాలు.

అప్పుల మీద ఎదిగిన సమృద్ధి క్షణకాలం మాత్రమే ఉంటే కష్టపడి చేస్తే వచ్చే వృద్ధి  మాత్రం నిలకడగా ఉంటుంది. ఆ గౌరవమే దేశానికి అసలైన సంపద. ప్రపం చంలో ముందుగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన దేశాలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు యుద్ధాల ధ్వంసంలో నాశనమైనప్పటికీ శ్రమ విలువతో తిరిగి నిలబడి తమ ఆర్థిక పునాదులను నిర్మించుకున్నాయి.

జపాన్‌ను చూసుకుంటే అక్కడి ఆర్థిక బలం యంత్రాల శబ్దంలోనే కాదు, శ్రమలోనూ నైతికత కనిపిస్తుంది. సమయపాల న, పనిపట్ల అంకితభావం, ప్రతీ పనికి గౌరవం.. దేశాన్ని బలంగా మార్చాయి. ఇక జర్మనీ లో నైపుణ్యానికి ఉన్న విలువే అక్కడి పరిశ్రమల వెనకున్న అసలైన శక్తి.

చేతివృత్తుల నుంచి ఉన్నత సాంకేతికత దాకా ప్రతి రం గంలో నాణ్యతే అక్కడి సంపదకు పునాది. నెదర్లాండ్స్ లాంటి దేశంలో భూమి కంటే నీరే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ నీటినే తమ ఆస్తిగా మార్చుకొని ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు విద్యను ఆర్థిక బలంగా మలచుకున్నాయి. 

సంపద సృష్టి..

అమెరికా లాంటి దేశం వ్యాపారాన్ని తన ఆర్థిక శ్వాసగా మార్చుకుంది. చిన్న ఆలోచనతో పెద్ద పరిశ్రమగా ఎదిగే అవకాశాలు అక్కడ విస్తృతంగా పెరిగాయి. శ్రమ, పరిశోధన, కొత్త ఆలోచన.. ఈ మూడింటి కలయికతోనే అక్కడ సంపద సృష్టి వేగం పుంజుకుంది. ఈ దేశాలన్నింటిలో ఒక ఉ మ్మడి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పొదుపు, క్రమశిక్షణ, నాణ్యత, దీర్ఘకాల దృష్టి లాంటి అంశాలను సమానత్వంగా భావించడంతో ఆ దేశాల్లో ఇవాళ సంపద పెరిగింది. కానీ ఆ సంపద చుట్టూ బాధ్యత అనే కంచె కూడా పెరిగింది. సమాజం నిలబడితేనే దేశం నిలబడుతుంది.

అందుకే ఆర్థిక స్థిరత్వం అనేది గమ్యం మాత్రమే కాదు, నిరంతరం సాగే ప్రయాణం కూడా. నిజానికి జపాన్, జర్మనీ, కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, అమెరికా వంటి దేశాలు మనకు చాలా దూరంలో ఉన్నా వాటి అభివృద్ధి ప్రతిబింబంలో కనిపిస్తుం ది. అంతిమంగా మన నేలకు, మన చేతులకు భవిష్యత్తును అప్పగించిన రోజే, మన ఆర్థిక బలం కూడా కాగితాల మాటున కా కుండా ప్రజల జీవితాల్లో కనిపించే నిజం గా మారుతుందన్న విషయం గ్రహించాలి.

 వ్యాసకర్త సెల్: 9490841284