calender_icon.png 5 December, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు

05-12-2025 12:18:44 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో కొలువై ఉన్న, దత్తాత్రేయ స్వామివారికి దత్త జయంతి సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త జయంతి కార్యక్రమానికి విచ్చేసిన, జహీరాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు బీబీ పాటిల్ దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బజరంగ్దళ్ కమిటీ సభ్యులు మాజీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్‌ను సన్మానించారు.

అనంతరం నూతనంగా వైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సిద్ధి శ్రీధర్ గుప్తను మాజీ ఎంపీ బీబీ పాటిల్ సన్మానించారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ.. వైశ్యసంఘం నూత న అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వైశ్య సంఘానికి ధనవంతు కృషి చేయాలని ఆపదలో ఉన్న వారికి అండగా ఉండాలని అన్నా రు. బిబి బాటిల్ వెంట మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ ఎల్లారెడ్డి బిజెపి నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.