05-12-2025 12:10:08 AM
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ డిసెంబర్ 4 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులతో కలసి దత్త స్వామివారి దివ్య దర్శనం పొందారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘శ్రీ దత్త స్వామి సేవా భావం ప్రతి మనిషిలో కొనసాగాలనే సంకల్పంతో నేను సర్వసాధారణ ప్రజల శ్రేయస్సు, సమాజ అభివృద్ధి ధార్మిక ప్రేరణను మా ముఖ్య కర్తవ్యం గా తీసుకుని భావిస్తున్నాను అన్నారు. భక్తులందరికీ సౌకర్యాలు, భద్రత మౌలిక సదుపాయాలను అందించడం ప్రతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత. భక్తుల ప్రేమ, విశ్వాసం ఆధ్యాత్మిక శక్తి సమాజానికి కొత్త దిశను చూపుతుందన్నారు.
ఈ సందర్భంలో ప్రజలతో ఒకచోట కలిసే అవకాశం, వారితో ఈ ఆత్మీకతను పంచుకునే అవకాశం నాకు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ‘ అని తన సంతోషాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్ మఠo. పవన్, ముందడ, పవన్, బాబీ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.