05-12-2025 12:19:58 AM
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న దత్తాత్రేయ జయంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేం దర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దత్తాత్రేయుని మొక్కుకున్నారు అనంతరం నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ కార్య కర్తలు తులసీదాస్ భరత్ మరియు బారాస మండల పట్టణ అధ్యక్షులు జలంధర్ రెడ్డి ఆదిమూలం సతీష్ కుమార్ ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింలు మాజీ కౌన్సిలర్ సాయిలు శ్రవణ్ అరవింద్ గౌడ్ పృథ్వీరాజ్ గంగారెడ్డి విట్టల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.