27-12-2025 12:04:36 AM
అశ్వాపురం, డిసెంబర్ 26, (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలో శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 101వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, మండల కా ర్యదర్శి అనంతరం సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో స్వాతంత్య్ర కాంక్షతో పుట్టిన సీపీఐ, ఎన్నో త్యాగాలు, సమరాలతో 100 ఏళ్లుగా ప్రజల పక్షాన నిలిచిందన్నారు.
దేశంపై మతోన్మాద భూతం వీరవిహారం చేస్తోందని, దానిని తరిమికొట్టాల్సిన బాధ్యత ఎర్రజెండాలదేనని, క మ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో 10 లక్షల హెక్టార్ల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐదేనని, మరో వందేళ్లు కూడా పార్టీ ప్రజలతో మమేకమై ఉంటుందని, పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పార్టీని బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, కొల్లు ఆశ , మండల నాయకులు మేలపుర సురేందర్ రెడ్డి, కొండపర్తి ప్రసాద్, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి, పగిడిపల్లి స్వరూప జంపయ్య, అక్కినపల్లి నాగేంద్రబాబు, సబ్కా అజయ్, కంచర్ల రవి, తేలం నాగేంద్ర, బండ్ల సీతమ్మ, బండ్ల తిరుపతయ్య, తేలం వెంకటరమణ, కల్లూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.