27-12-2025 01:46:43 AM
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రస్టిక్ ఇంటెన్స్ లవ్‌స్టోరీతో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్త్తున్నారు. వైజయంతి మూవీస్ అశ్వినీదత్ సమర్పిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాషా తడాని ఇందులో జయకృష్ణ సరసన కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. చిత్రబృందం ఇప్పుడు 30 రోజుల పాటు సాగిన తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో 30% చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కీలక సన్నివేశాలు, పాటలు, ప్రధాన టాకీ పార్ట్‌ను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. త్వరలో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేయనున్నట్టు టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.