calender_icon.png 27 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారానికి కాదు

27-12-2025 12:02:57 AM

  1. సర్పంచ్‌లు గ్రామ సమస్యలు పరిశ్కారమే లక్ష్యంగా పనిచేయాలి

అభినందన సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఆళ్ళపల్లి, డిసెంబర్ 26,(విజయక్రాంతి):ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారానికి కాదు అని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన సభలో ముఖ్యతిథిగా పాయం పాల్గొన్నారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజల తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని విజయం నుంచి మరింత సేవ దిశగా అడుగులు వేయాలన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం ప్రజల నమ్మకానికి, ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతోందని.

ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు అధికారానికి కాదు నిజాయితీకి, ప్రజల పక్షాన నిలిచే రాజకీయానికి ఇచ్చిన మద్దతుగా నిలిచిందన్నారు, ఈ గెలుపు ఒక్క నాయకుడి విజయమేగాక ప్రతి కార్యకర్త చేసిన పోరాటానికి, ప్రతి ఓటరు వ్యక్తం చేసిన ఆశకు ప్రతిబింబమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా వినే రాజకీయమే కాంగ్రెస్ పార్టీ బలమని, ప్రజలతో కలిసి నడిచే విధానమే తమ మార్గమని తెలిపారు.

ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని, రాబోయే రోజుల్లో పినపాక నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పాత్ర మరింత స్పష్టంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఐక్యత, నాయకుల అంకితభావం, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ పినపాకలో మరింత బలంగా నిలబడి, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాయం రామ నరసయ్య , మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య , మహిళ అధ్యక్షురాలు గలిగ సమ్మక్క , కాంగ్రెస్ పార్టీ మండల కో-ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ సీనియర్ నాయకులు మహమ్మద్ అతహార్,తాల్లపల్లి వెంకన్న, భరత్ శ్రీనాథ్ ముప్పారపు రాము మండల ముఖ్యనాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.