calender_icon.png 27 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీహెచ్‌పీ.. భజరంగ్‌దళ్ కన్నెర్ర

27-12-2025 01:45:18 AM

  1. ‘బంగ్లా’లో హిందువులపై దాడులను ఖండించిన ఆధ్యాత్మిక సంస్థలు 
  2. భారత దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ
  3. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్
  4. దాడులను నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత విదేశాంగశాఖ

న్యూఢిల్లీ/ ఢాకా, డిసెంబర్ 26: బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. శుక్రవారం ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కోల్‌కతా, అగర్తల, బిజ్నీతోపాటు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లోనూ హిందూ ధార్మిక సంఘాలు పెద్దఎత్తున ఆం దోళన నిర్వహించాయి. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయానికి వెలుపల విశ్వహిం దూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్‌దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.

బంగ్లా దేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లాలో దీపూ చంద్రదాస్ అనే హిందువును అల్లరి మూకలు దారుణంగా హతమార్చాయని, ఆ ఘటన మరువకముందే బుధవారం రాత్రి రాజ్‌బా రి జిల్లాలో అమృత్ మండల్ అలియాస్ సా మ్రాట్(30) అనే హిందూ యువకుడిని కూ డా పొట్టనపెట్టుకున్నాయని ఆందోళన వ్య క్తం చేశాయి. మృతుల కుటుంబాలకు న్యా యం జరిగేలా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

హిందువుల హత్యలకు కారణమైన దోషులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాలో హిందువులకు రక్షణ కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. మై నార్టీల ప్రాణాలను కాపాడాలని అంతర్జాతీయ సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి(ఐరాస) జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తలు అదుపులోకి తెచ్చేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ ఉప హైకమిషన్ ఎదుట గత మంగళవారం ఆందోళన చేపట్టిన 12 మంది నిరసనకారులకు కోల్‌కత్తా న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఈకేసులో మొత్తం 19 మందిని అరెస్ట్ చేయగా, వీరిలో ఏడుగురు మహిళలకు గతంలోనే బెయిల్ వచ్చింది.

తాజాగా మిగిలిన 12 మందికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. మరోవైపు ఆ దేశంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథయలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రత్యేక సహా యకుడు ఖుదా బక్ష్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడి హత్య కేసు లో అరెస్టున నలుగురు నిందితులు కోర్టు ముందు తమ నేరాన్ని అంగీకరించారు. 

స్వదేశానికి తారిఖ్ రెహమాన్

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణా మం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం నుంచి లండన్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) చైర్మన్ తారిఖ్ రెహమాన్ శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు. 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు చేరుకున్న ఆయన ఢాకాలోని తన తండ్రి జియార్ రెహమాన్ సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం రెహమాన్ మాట్లాడుతూ.. దేశంలో శాంతిసౌభాగ్యాలు నెలకొల్పేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ వర్గాలకు భద్రత కల్పించేందుకు పనిచేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు తారిఖ్ బంగ్లాకు చేరుకోవడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

అన్నీ గమనిస్తున్నాం: భారత విదేశాంగశాఖ

బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువులతోపాటు మైనార్టీవర్గాలైన క్రైసవ, బౌద్ధులపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగశాఖ శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకే నెలలో ఇద్దరు హిందూ వ్యక్తులు దారుణంగా హత్యకు గురవ్వడం విచారకరమని పేర్కొన్నారు. మైనార్టీలపై జరుగుతున్న దాడుల నివారణకు తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. హిందువులను హతమార్చిన అల్లరి మూకలను గుర్తించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం పాలనా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మైనార్టీలపై దాడులు పెచ్చరిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ దేశంలో 2,900 వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం దాడులన్నింనిటీ నిశితంగా పరిశీలిస్తోందని గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మతతత్వవాదులు భారత్‌కు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.