calender_icon.png 27 December, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతనంగా గెలిచిన సర్పంచ్‌లను సన్మానించిన మంత్రులు

27-12-2025 01:45:21 AM

తూప్రాన్, డిసెంబర్ 26 : తూప్రాన్ మండలంలో కాంగ్రెస్ తరపున గెలిచిన నూతన సర్పంచులు గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేయడంతో పాటు నూతనంగా గెలిచిన సర్పంచులను సభా వేదికపై శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు శక్తివంచన లేకుండా పని చేస్తామని కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంక్షారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, తూప్రాన్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు చుక్క హిమబిందు, ప్రధాన కార్యదర్శి సబ్బని వెంకటేష్, యావపూర్ సర్పంచ్ యాంజాల స్వామి, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్, దోమలపల్లి యాదమ్మ కృష్ణ, దాతర్పల్లి సర్పంచ్ జయరాములు, నాగులపల్లి సర్పంచ్ శ్రీలత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.