calender_icon.png 1 February, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాలే ప్రధానంగా ‘స్కై’ని తీశాం

01-02-2026 01:01:21 AM

మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మిగుంటక, మురళీకృష్ణంరాజు, పృథ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు. ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్‌కే మణి బా మ్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో శివప్రసాద్ అనే కొత్త మ్యూ జిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.

ఫిబ్రవరి 6న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా శనివా రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హీ రో మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ చిత్రానికి నిజమైన హీరోలు మా డైరెక్టర్ పృథ్వీ, నిర్మాతలు నాగిరెడ్డి, శ్రీలక్ష్మి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూవీ కంప్లీట్ చేసి రిలీజ్‌కు తీసుకొస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శివ ఆటోడ్రైవర్, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి రాగలిగాడు. లిరికల్ సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కింది. థియేట్రికల్‌గా కూడా ఇదే సక్సెస్ ఇస్తా రని కోరుకుంటున్నా” అన్నారు. హీరోయిన్ శ్రుతిశెట్టి మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో హీరోయిన్ ది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్‌” అని చెప్పారు.

‘మా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని డైరెక్టర్ పృథ్వీ తెలిపారు. నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ.. “హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో ప్రేక్షకులు చూడబోతున్నారు” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీవోపీ రసూల్ ఎల్లోర్, మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ తదితర చిత్రబృందం మాట్లాడారు.