calender_icon.png 13 May, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ విస్తరణకు సీపీఐ శ్రేణులు కృషి చేయాలి

12-05-2025 12:11:22 AM

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా 

భద్రాద్రి కొత్తగూడెం మే 11 (విజయ క్రాంతి) పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేవిధంగా కృషి చేయడం ద్వారా పార్టీ విస్తరణకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలనీ సిపిఐ జి ల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఆదివారం  పట్టణంలోని రామవరం సెంట ర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండా ను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

కార్మికవర్గానికి, పేదప్రజలకు అనునిత్యం సేవలందించేది కమ్యూనిస్టు పా ర్టీ, ఏఐటీయూసీనేనని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి ఎదురులేదని, ప్రజలకు అందించిన సేవల ఫలితంగాలో రోజురోజుకు జనాదరణ పెరుగుతుందని అ న్నారు.

సమావేశంలో నాయకులు కంచర్ల జ మలయ్య, జి వీరాస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీను, ఎస్ కె ఫహీమ్, పాటి మోహన్,  మాతంగి లింగయ్య, మాటేటి గో పాల్,  గురుమూర్తి, గోపి, తూముల శ్రీనివా స్, గుత్తుల శ్రీనివాస్, ఖయూమ్, నగేష్, అం కూస్, సింగిరాల రమేష్, దాసు, జలీల్, రణధీర్, మర్రి కృష్ణ, విజయలక్ష్మి, దార లక్ష్మి, శంకర్, దాట్ల శ్రవణ్, అలీం, అనీఫ్, నరేందర్  తదితరులు పాల్గొన్నారు.