calender_icon.png 13 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంసెట్ ఫలితాలలో బ్రిలియంట్ విద్యార్థుల విజయకేతనం

12-05-2025 12:14:26 AM

బూర్గంపాడు,మే11(విజయక్రాంతి): ఆదివారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలి తాలలో సారపాక బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరొకసారి విజయకేతనం ఎగర వేశారు. ఇంజనీరింగ్ విభాగం లో ఎ.రస్మిత రెడ్డి 8688 ర్యాంకుతో ఫస్ట్ ర్యాంకు సాధించగా ఆర్.వినయ్ శరణ్ చౌ దరి 11522 వ ర్యాంకుతో సెకండ్ ర్యాంకును సాధించారు.

అగ్రికల్చరల్,ఫార్మసీ విభాగంలో  విహెచ్. సాత్విక 20143వ ర్యాంకు తో ఫస్ట్ ర్యాంకు సాధించగా షేక్.సన 214 06వ ర్యాంకుతో సెకండ్ ర్యాంకు సాధించగా,మరో నలుగురు విద్యార్థులు ఇంజనీ రింగ్ విభాగంలో 25000 లోపు ర్యాంకులను సాధించగా,అగ్రికల్చరల్ ,ఫార్మసీ విభా గంలో ముగ్గురు విద్యార్థులు 27000 లోపు ర్యాంకులను సాధించినట్లు ఆ కళాశాల చైర్మ న్ డాక్టర్ బిఎన్‌ఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డా.బిఎన్‌ఆర్ మాట్లాడుతూ గ్రామీణ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు బ్రిలియంట్ కాలేజ్ నం దు ఎంసెట్ కోచింగ్ తీసుకుని 99శాతం ఉత్తీర్ణత సాధించినందుకు మాకు ఎంతో ఆ నందంగా ఉందని అన్నారు.మరొకసారి సారపాక కీర్తి కిరీటాన్ని రాష్ట్ర స్థాయిలో నిలిపారని అన్నారు.

ఈ ఎంసెట్ ఫలితాలలో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు.మంచి ఫలితాలను సాధించేందు కు సహకరించిన తల్లిదండ్రులకు , అధ్యాపకులకు ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.