calender_icon.png 13 May, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొసైటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

13-05-2025 12:58:02 AM

బోధన్,మే 12 (విజయ క్రాంతి) : బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం హున్సా  గ్రామంలో  సహకార సంఘం నూతన భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

హున్సా సొసైటీ చైర్మన్ మంధర్నా రవి అధ్యక్షతన సోమవారం ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈసందర్బంగా సోసైటీ చైర్మన్ మంధర్నా రవి, పాలక వర్గ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం పాలకవర్గం సభ్యులు  హుnసా రైతు వేదిక మరమ్మతులకు, రైతువేదిక చుట్టూ ప్రవారి గోడ నిర్మాణానికి నిధులు మంజూరు కొరకు వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి  నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. అందుకు హుంసా సోసైటీ పరిధిలోని రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, టిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరావు, మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ చీల శంకర్, పార్టీ నాయకులు,కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.