13-05-2025 12:58:05 AM
మంథని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి
మంథని మే12(విజయక్రాంతి) సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి దీవెనలతో మంథని ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దిద్దుళ్ల శ్రీనుబాబు అన్నారు.
మల్హర్ రావు మండలంలోని గాధంపల్లిలో శ్రీ వీర సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దత్తత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో, పెద్దతుండ్ల లో శ్రీ దత్తత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనమహోత్సవంలో శ్రీను బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలని, ఈ ఏడు పాడి పంటలు బాగా పండి రైతులు, ప్రజల ఆనందంగా ఉండాలని శ్రీను బాబు కోరారు.