calender_icon.png 13 May, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లపోచమ్మను దర్శించుకున్న భక్తులు

12-05-2025 12:10:12 AM

కౌడిపల్లి(మెదక్) మే 11: మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయానికి ఆదివారం  వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆలయంలో ఆలయ పూజారులు శివప్ప, విగ్నేశ్, రాజేష్ అందంగా అలంకరించిన అమ్మవారికి అమృతాభిషేకం కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

మహిళా భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిం చారు. భక్తులు తమ వద్ద అందంగా అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు దరువులతో పోతరాజుల నృత్యాలు, శివశక్తుల పూనకాలు, నల్ల పోచమ్మకు జై అంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. 

ఆలయ ప్రాంగణంలో తమ కోరికలు నెరవేరాలని మహిళలు ముడుపులు కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు విందు భోజనాలు చేసి సేద తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో రంగారావు  సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ఆలయ సిబ్బంది రాజు, అశోక్, గ్రామ పెద్దలు భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు.