calender_icon.png 30 August, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారం కోసమే "సీపీఎం" ఇంటింటి సర్వే

30-08-2025 12:27:46 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం

చండూరు,(విజయక్రాంతి): గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంతో సిపిఎం పార్టీ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని శేరి గూడెం ,కమ్మగూడెం గ్రామాలలో ఇంటింటి సర్వే నిర్వహించి పలు వార్డులలో సర్వే నిర్వహించి గ్రామ ప్రజలను సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శేరి గూడెం నుండి  నేర్మట, నామ్మాపురం,తెరటి పల్లి మద్దివారిగూడెం గ్రామాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించాలి అని అన్నారు.

శేరి గూడెం బజార్లకు సీసీ రోడ్లు , మెయిన్ రోడ్డుకు రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని,  అన్ని స్తంభాలకు వీధిలైట్లను వెలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.  కమ్మగూడెం లో సీసీ రోడ్లు , మురికి కాల్వలు , కమ్మ గూడెం నుండి వెల్మ కన్నె కు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్న వీధుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి , దోమల పిచికారి మందును పిచికారి చేయాలని కోరారు , కమ్మ గూడెం లోని అన్ని స్తంభాలకు వీధిలైట్లను వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వల్లూరి శ్రీశైలం , పబ్బు మారయ్య, మాలిగా శివ , మల్లమ్మ ఎల్లయ్య కృష్ణయ్య మద్ది నరసింహ , గుడ్డేటి యాదమ్మ పోలింగ్కి ప్రశాంత్,గుడ్డేటి ముత్తమ్మ  తదితరులు పాల్గొన్నారు.